తొలిసారి ఐస్‌క్రీం తిన్న చిన్నారి రియాక్షన్‌.. | Babys Priceless Reaction To Her First Ice Cream | Sakshi
Sakshi News home page

తొలిసారి ఐస్‌క్రీం తిన్న చిన్నారి రియాక్షన్‌..

Jan 23 2020 9:28 AM | Updated on Jan 23 2020 10:01 AM

Babys Priceless Reaction To Her First Ice Cream - Sakshi

ఐస్‌క్రీం అంటే ఇష్టపడనివారు ఉండరేమో. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అవకాశం వచ్చినప్పుడల్లా హిమక్రీంలను తెగ లాగించేస్తుంటారు. ఇక చిన్న పిల్లలకు ఐస్‌క్రీమ్‌ కొనిస్తే వాళ్ల ఆనందం పట్టలేము. అలాంటిది తొమ్మిది నెలల చిన్నారి తొలిసారి చల్లటి ఐస్‌క్రీమ్‌ను రుచి చూస్తే. ఆ బుజ్జిదాని హావాభావాలు చూడాల్సిందే.  ఇలాగే ఓ చిన్నారిని తల్లిదండ్రులు ఐస్‌క్రీం పార్లర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కోన్‌ ఐస్‌క్రీంను పాపకు మొదటిసారి రుచి చూపించారు. ఆ సమయంతో పాప ముఖం సంతోషంతో వెలిగిపోయింది. 

బుజ్జిపాప ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి రుచి చూడలేదేమో... ఆమాంతం తన రెండు చేతులతో ‍కోన్‌ను గట్టిగా పట్టుకుని ఇష్టంగా తినడం ప్రారంభించింది. తన నుంచి ఎవరైనా ఐస్‌ క్రీం లాక్కుంటారనే భయపడి నోరు పెద్దగా తెరిచి గబాగబా తినేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ దృశ్యాన్ని చిన్నారి బ్లేక్లీ తల్లి బ్రిటారి జెర్నిగాన్‌ తన టిక్‌టాక్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.ఈ వీడియో నచ్చడంతో నెటిజన్లు తెగ షేర్‌ చేస్తూ మంత్రముగ్ధులు అవుతున్నారు. పాపాయి ముఖంలో వెలుగుతున్న సంతోషాన్ని వెలకట్టలేం అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement