'ముద్దులకు దూరంగా ఉండాల్సిందే!'

Avoid Kisses As CoronaVirus Crisis Grows Says Scientist Lord Winston - Sakshi

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు పరస్పర కరచాలనాలకే కాకుండా సోషల్‌ కిస్సింగ్‌లతో పాటు ప్రేమ, ముద్దులకు కొంతకాలం దూరంగా ఉండాలంటూ లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్, ప్రముఖ శాస్త్రవేత్త లార్డ్‌ విన్‌స్టన్‌ పిలుపునిచ్చారు. ఆయన కరోనా వైరస్‌పైపై లండన్‌లో మంగళవారం జరిగిన ఓ చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ... ఈ రోజు తనకు ఇద్దరు మిత్రులు సోషల్‌ కిస్సింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వారిని వారించానని చెప్పారు. కరచాలనం కంటే సోషల్‌ కిస్సింగ్‌ వల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. తన మాటలను తన భార్య కూడా వింటుండవచ్చని, ఆమెను ఉద్దేశించి కూడా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. (హైటెక్‌ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!)

ఓ మనిష ముక్కును, కళ్లను రోజుకు 70 నుంచి వందసార్లు తాకే అవకాశం  ఉందని ఆయన అన్నారు. చేతులతోని ముక్కు, నోరు, కళ్లను తాకకుండా జాగ్రత్త వహించాలని కూడా ఆయన సూచించారు. చేతులు శుభ్రంగా ఉంటే ఫర్వాలేదుగానీ లేకపోనట్లయితే ప్రమాదమే కదా! అని ఆయన చెప్పారు. 20 సెకండ్లకు తక్కువ కాకుండా తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. 
(ఇరాన్‌లో 92కు చేరిన కరోనా మృతుల సంఖ్య)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top