హైటెక్‌ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!

Covid 19 Panic At Hyderabad Raheja Mindspace Orders Work From Home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను సైతం గడగడలాడిస్తోంది. హైటెక్‌ సిటీలో కరోనా కలకలం రేగడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాలు... రహేజా మైండ్‌ స్పేస్‌లో గల ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న టెకీ ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్లు భావిస్తున్నారు. వైరస్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడటంతో సదరు బిల్డింగ్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. (దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి)

ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించి.. వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశించాయి. హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని ఆదేశించాయి. హ్యాండ్‌ సానిటైజర్స్‌ ఉపయోగించాలని... జన సమ్మర్ధం ఉన్నచోట వస్తువులను తాకడం, కరచాలనం చేయకూడదని ఉద్యోగులకు సూచించాయి. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మెట్ల మార్గం ఉపయోగించాలని.. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నాయి.(వారికి కరోనా సోకలేదు: పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top