భారత ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్‌

Applications For H-1B Visa To Be Accepted From April 1 -US - Sakshi

హెచ్‌1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 2020 ఏప్రిల్‌ 1 నుంచి  ప్రారంభం

వాషింగ్టన్‌ : హెచ్‌1బీ వీసాలకోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌.  హెచ్-1 బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తులను 2020 ఏప్రిల్ 1నుంచి స్వీకరించనున్నట్లు  అమెరికా జాతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది.  2021 సంవత్సరానికి గాను హెచ్‌1 బీ (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసాలు జారీకి అవసరమైన ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌)శుక్రవారం వెల్లడించింది.  

భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల మంది ఐటీ ఉద్యోగులకు హెచ్‌1 బీ వీసాలకోసం ఆయా కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. ఇందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోనున్నాయి.  హెచ్‌1బీ కోసం దరఖాస్తు చేసుకునే ఐటీ కంపెనీలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ప్రాసెసింగ్‌ ఫీజు కింద 10 అమెరికన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్‌ 1, 2020 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా పరిమితికి లోబడి హెచ్‌1బీ వీసాలను దక్కించుకోవచ్చు. కేవలం తమ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక సమాచారంతోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 1 నుండి  20 వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి వుంటుందని యుఎస్‌సిఐఎస్ తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top