4500‌ చైనా గేమ్స్‌ తొలగింపు

Apple Removed games from its App Store in China - Sakshi

వాషింగ్టన్‌ : భారత్‌ నుంచి భారీ డిజిటల్‌ స్ట్రైక్స్‌ను చవిచూసిన చైనాకు దిగ్గజ మొబైల్‌ సంస్థ యాపిల్‌ ఊహించిన షాక్‌ ఇచ్చింది. చైనీస్‌ యాప్‌ స్టోర్‌లోని 4500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగించింది. గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించడంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్‌ దానిలో భాగంగానే చైనా గేమ్స్‌ను‌ తొలగించినట్లు ప్రకటించింది. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేని గేమ్స్‌ కూడా యాప్స్‌లో ఉంచుతున్నారని, ఇక మీదట అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అయితే ఇదేమీ తాము ఉన్న ఫలంగా తీసుకున్న చర్య కాదని, లైసెన్స్‌ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని గత ఏడాదే ప్రకటించినట్లు గుర్తుచేసింది. దీనిలో భాగంగానే ముందుగా విధించిన గడువు ప్రకారం జూన్‌ 30 నుంచి చైనాకు చెందిన గేమ్స్‌ను యాప్‌ నుంచి తొలగిస్తున్నామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. (‘బ్యాన్‌ టిక్‌టాక్’‌ అమెరికాలోనూ..!)

లైసెన్స్‌ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన అనంతరం చట్ట ప్రకారం అప్లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరిణామం చైనా కంపెనీలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్‌-చైనా సరిహద్దుల్లో చోటుచేసున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 వేలకోట్ల రూపాయల వరకు చైనా కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్లోబల్‌ టైమ్స్‌ అంచనా వేస్తోంది. (టిక్‌టాక్‌ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top