నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్.. గంటసేపు హల్ చల్! | A Naked Woman Dancing on a vehicle in Houston | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్.. గంటసేపు హల్ చల్!

Mar 8 2016 7:13 PM | Updated on Oct 16 2018 8:38 PM

నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్.. గంటసేపు హల్ చల్! - Sakshi

నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్.. గంటసేపు హల్ చల్!

ఓ మహిళ చేసిన నిర్వాకంతో హైవే మొత్తం ఓ గంటపాటు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంది.

 ఓ మహిళ చేసిన నిర్వాకంతో హైవే మొత్తం ఓ గంటపాటు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంది. ఆమె చేష్టలతో అరవై నిమిషాలు ఆ మార్గాన్ని మూసివేయాల్సి వచ్చిందంటే ఆమె ఏ స్థాయిలో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్ లోని హోస్టన్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు విషయం ఇది... ఓ మహిళ తన కారులో హోస్టన్ ఏరియాలో హైవే 290పై వెళ్తోంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, ఆమె కారుతో పాటు మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆ వెంటనే ఆమె ఓ పెద్ద వాహనంపైకి ఎక్కింది. క్షణాల్లో నగ్నంగా మారిపోయింది. కొద్దిసేపు అలాగే డాన్స్ చేసింది. అనంతరం అలాగే కూర్చుండిపోయింది.

తన శరీరాన్ని సాధ్యమైనంతవరకు చేతులు, కాళ్లతో కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తూ నానా తిప్పలు పడిందట. ఆమె డాన్స్ చేయడం ఆపిన వెంటనే కొందరు అధికారులు ఆమెను అతికష్టం మీద ఆ వాహనంపై నుంచి కిందగి దింపారు. అంతకుముందు గంటసేపు ప్రయత్నించిన ఆమె చేష్టలను ఆపలేకపోవడం గమనార్హం. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సుమారు ఉదయం 10గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని హోస్టన్ అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అయితే గంటపాటు ఆ ప్రాంతంలో దారిని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు వచ్చాయట. జెర్సీ ఏరియాలో అంతకుముందు కూడా ఆమె ఓ యాక్సిడెంట్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement