బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ | 70 thousand people fear because of bomb | Sakshi
Sakshi News home page

బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ

Feb 12 2017 4:56 AM | Updated on Sep 5 2017 3:28 AM

బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ

బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ

గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది.

తెస్సాలోనికి: గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి  తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు. తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు.

బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్‌లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement