లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ | 7,500 Miles In 18 Days: China To London Train Now | Sakshi
Sakshi News home page

లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ

Jan 4 2017 9:13 AM | Updated on Sep 5 2017 12:24 AM

లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ

లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ

బ్రిటన్‌కు చైనా తన తొలి గూడ్సు రైలును ప్రారంభించింది. జిజియాంగ్‌ ప్రావిన్స్‌లోని యివు అనే హోల్‌ సేల్‌ మార్కెట్‌ పట్టణం నుంచి లండన్‌కు తన తొలి రైలును ప్రారంభించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది.

బీజింగ్‌: బ్రిటన్‌కు చైనా తన తొలి గూడ్సు రైలును ప్రారంభించింది. జిజియాంగ్‌ ప్రావిన్స్‌లోని యివు అనే హోల్‌ సేల్‌ మార్కెట్‌ పట్టణం నుంచి లండన్‌కు తన తొలి రైలును ప్రారంభించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఈ రైలు దాదాపు 7,500 మైళ్లు (12,000 కిలోమీటర్లు) 18 రోజులపాటు ప్రయాణించనుంది. అంతేకాదు ఈ రైలు ఎన్నో దేశాలను దాటి వెళ్ల నుంది.

కజకిస్తాన్‌, రష్యా, బెలారస్‌, పోలాండ్‌, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్‌ మీదుగా వెళ్లి లండన్‌ చేరుకోనుంది. గతంలో బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌ చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ రైలు ప్రారంభమైంది. చైనాతో మరోసారి సంబంధాలు పెట్టుకోవడం స్వర్ణంగా మిగిలిపోతుందని బ్రిటన్‌ కొత్త ప్రధాని థెరిసా మే అభివర్ణించారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చిన నేపథ్యంలో చైనాతో ఈ సంబంధాలు తమకు చాలా లబ్ధిని చేకూరుస్తాయని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement