freight train service
-
Uttar Pradesh: ట్రక్కును 100 మీటర్లు లాక్కుపోయిన గూడ్సు
అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో గూడ్స్ రైలు(Goods train), కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లక్నో-వారణాసి రైలు విభాగంలో రైల్వే క్రాసింగ్ వద్ద కంటైనర్ ట్రక్కు, గూడ్స్ రైలు ఢీ కొన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటనలో ట్రక్కు డ్రైవర్ సోను చౌదరి(28) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. జగదీష్పూర్(Jagdishpur) పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రైల్వే గేట్ తెరిచివున్న సమయంలో ఒక ట్రక్కు గేటు దాటుతూ, ట్రాక్‌పై నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో అటుగా వచ్చిన గూడ్సు రైలు కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కంటైనర్‌ను గూడ్సు దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. దీంతో కంటెయినర్ పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.గాయపడిన డ్రైవర్ సోను చౌదరిని తొలుత జగదీష్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(Community Health Center)కు చికిత్స కోసం తీసుకువెళ్లామని, అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ లైన్లతో పాటు రైల్వే ట్రాక్‌లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ట్రాక్‌లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసిన తర్వాత, రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని లక్నో డివిజన్ రైల్వే మేనేజర్ సచీంద్ర మోహన్ శర్మ తెలిపారు.ఇది కూడా చదవండి: లాలూ, రబ్రీ, తేజ్ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు -
సరుకు రవాణా హబ్‌గా గజ్వేల్
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ స్టేషన్‌ను సరుకు రవాణా హబ్‌గా మార్చాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు త్వరలో సరుకు రవాణా రైళ్లను ప్రారంభించాలని సంబంధిత విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు, ఎరువులను ఇతర ప్రాంతాల నుంచి గజ్వేల్‌కు చేరవేయాలని అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్ స్టేషన్ వద్ద మొత్తం ఐదు లైన్లు ఉండగా, ఒక లైన్‌ను గూడ్సుకు కేటాయించారు. ఇక్కడ 755 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో సరుకుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ నిర్మించారు. ప్రయాణికుల రైళ్లు ప్రారంభించేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నా, కోవిడ్ ఆంక్షలతో ఇంతకాలం ప్రారంభించలేదు. ఆంక్షలు సడలినా ఆ జాప్యం కొనసాగుతూనే ఉంది. సరుకు రవాణా రైలు అంశం జోన్ పరిధిలోనిది అయినందున, వెంటనే ప్రారంభించాలని అధికారులు కోరుతున్నారు. రైల్వే రవాణా ఖర్చు తక్కువ... గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో, సిద్దిపేట వరకు విస్తారంగా సాగుభూములున్నాయి. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి, మిరప లాంటివి బాగా పండుతున్నాయి. ఇక్కడి నుంచి సేకరించే ధాన్యా న్ని రోడ్డు మార్గాన వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు వీటి తరలింపునకు రైళ్లను ప్రారంభిస్తే మంచి డిమాండ్ ఉంటుందని రైల్వే యంత్రాంగం నిర్ధారించింది. దీంతోపాటు పాలు కూడా సేకరించవచ్చని నిర్ణయించారు. ఇక ఈ ప్రాంతంలో ఎరువుల వినియోగం ఎక్కువ. నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి లారీల ద్వారా ఎరువులు వస్తుంటాయి. రైళ్లను ప్రారంభిస్తే వాటి ద్వారానే ఎరువులను గజ్వేల్‌కు చేరవేసే వీలుంటుంది. లారీలతో పోలిస్తే రైళ్ల ద్వారా రవాణా ఖర్చు తక్కువే అయినందున వ్యాపారులు కూడా ముందుకొస్తారని అధికారులంటున్నారు. త్వరలోనే గజ్వేల్ నుంచి సరుకు రవాణా రైళ్లు ప్రారంభమవుతాయని వారు పేర్కొంటున్నారు. -
లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ
-
లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ
బీజింగ్: బ్రిటన్‌కు చైనా తన తొలి గూడ్సు రైలును ప్రారంభించింది. జిజియాంగ్ ప్రావిన్స్‌లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి లండన్‌కు తన తొలి రైలును ప్రారంభించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఈ రైలు దాదాపు 7,500 మైళ్లు (12,000 కిలోమీటర్లు) 18 రోజులపాటు ప్రయాణించనుంది. అంతేకాదు ఈ రైలు ఎన్నో దేశాలను దాటి వెళ్ల నుంది. కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా వెళ్లి లండన్ చేరుకోనుంది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ రైలు ప్రారంభమైంది. చైనాతో మరోసారి సంబంధాలు పెట్టుకోవడం స్వర్ణంగా మిగిలిపోతుందని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అభివర్ణించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో చైనాతో ఈ సంబంధాలు తమకు చాలా లబ్ధిని చేకూరుస్తాయని ఆమె అన్నారు.