మరో భారీ కాల్‌ సెంటర్‌ స్కాం వెలుగులోకి

5 Indian BPOs, 7 Employees Charged In Massive Call Centre Scam In US - Sakshi

షికాగో:  కోట్లాది రూపాయల  కాల్‌ సెంటర్ల స్కాం సంచలనం రేపింది. భోపాల్‌లో నకిలీ కాల్ సెంటర్ కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని  అయిదు  కాల్ సెంటర్‌ ఆపరేటర్లు, మరో ఏడుగురు వ్యక్తులు  2వేలకు  పైగా అమెరికన్లను నిలువునా ముంచేశారు.  ఈ మేరకు  అమెరికా న్యాయవిభాగం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఏడుగురు భారతీయులతో సహా 15 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపింది.  5.5 మిలియన్‌డాలర్ల మేర  నష్టపోయినట్టు  వెల్లడించింది.

2012 , 2016 మధ్యకాలంలో అంతర్గత రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్‌) లేదా పే డే రుణాల పేరుతో  బాధితులను మోసగించారని అటార్నీ బైయుంగ్ జే పాక్ తెలిపారు. అంతేకాదు  రుణాలు చెల్లించకపోతే అరెస్టు, జైలు శిక్ష, పన్నుఎగవేత  జరిమానాల పేరుతో బెదిరంపులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ స్కామ్‌కు సంబంధించి అమెరికాలో ఏడుగుర్ని అరెస్ట్ చేశారు.

ముఖ్యంగా ఎక్సలెంట్‌ సొల్యూషన్స్, ఏడీఎన్‌ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోస్ బీపీవో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడోర్ ఇన్ఫోసోర్స్, సురిక్ బీపీవో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. శైలేష్‌ కుమార్ శర్మ, దిలీప్‌ కుమార్ కొద్వాని, రాధీరాజ్ నటరాజన్, శుభం శర్మ, నీరవ్ జనక్‌భాయ్‌ పాంచల్, అతార్ పర్వేజ్ మన్సూరి, మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ కజిమ్, మొహమ్మద్ సోజాబ్ మోమిన్, రోడ్రిగో లియోన్ కాస్టిల్లో, డెవిన్ బ్రాడ్‌ఫోర్డ్ పోప్, నికోలస్ అలెజాండర్ డీన్, డ్రూ కైల్ రికిన్స్, జాంట్జ్ పర్రిష్ మిల్లర్ నిందితులుగా ఉన్నారని పాక్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top