కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్! | 370 kg cocaine found at Coca Cola plant | Sakshi
Sakshi News home page

కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్!

Sep 1 2016 10:53 AM | Updated on Sep 4 2017 11:52 AM

కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్!

కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్!

కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్ బయటపడటం కలకలం రేపింది.

లండన్: కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్ బయటపడటం ఫ్రాన్స్లో కలకలం రేపింది.  దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' బుధవారం వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ వర్కర్ల పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్గ్రాస్ వెల్లడించారు. కొకైన్ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement