ఉగ్రవాదులనుకొని బాంబులు వదిలితే.. | 33 dead in US-led north Syria air strike | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులనుకొని బాంబులు వదిలితే..

Mar 22 2017 7:18 PM | Updated on Aug 24 2018 4:57 PM

ఉగ్రవాదులనుకొని బాంబులు వదిలితే.. - Sakshi

ఉగ్రవాదులనుకొని బాంబులు వదిలితే..

సిరియాలో మరోసారి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భాగంగా సిరియా బలగాలతో కలసి పాల్గొంటున్న అమెరికా సైనిక విమానం జరిపిన బాంబు దాడిలో 33మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలుకోల్పోయారు.

బీరుట్‌: సిరియాలో మరోసారి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భాగంగా సిరియా బలగాలతో కలసి పాల్గొంటున్న అమెరికా సైనిక విమానం జరిపిన బాంబు దాడిలో 33మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు అని భ్రమపడి ఓ మూతబడిన పాఠశాలపై అమెరికా యుద్ధ విమానం దానిపై బాంబును జారవిడచడంతో దాదాపు 33మంది ప్రాణాలుకోల్పోయారు. వీరంతా కూడా బాంబు దాడుల కారణంగా తమ తమ సొంత ప్రదేశాలను విడిచిపెట్టి వచ్చినవారే. సిరియా పౌర హక్కుల సంస్థ ఈ విషయం తెలిపింది.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల చెరలో అల్‌ మన్సూరా అనే సిరియా ప్రాంతం ఉంది. ఇక్కడ రక్బా ప్రాంతానికి 20 మైళ్ల దూరంలో ఓ పాఠశాల ఉంది. అందులోకి ఆయా ప్రాంతాల్లో బాంబు దాడులకు తట్టుకోలేక నిరాశ్రయులుగా మిగిలిన కొంతమంది శరణార్థులుగా మిగిలిపోయారు. వారంతా కూడా ఆ స్కూల్‌ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. వారి కదలికలను గమనించి యూఎస్‌ యుద్ధ విమానం ఉగ్రవాదులుగా భావించి బాంబులు వేయడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement