లాటరీలో 2,888 కోట్ల జాక్‌పాట్‌ | 2,888 crore jackpot in lottery | Sakshi
Sakshi News home page

లాటరీలో 2,888 కోట్ల జాక్‌పాట్‌

Jun 13 2017 2:09 AM | Updated on Sep 5 2017 1:26 PM

లాటరీలో 2,888 కోట్ల జాక్‌పాట్‌

లాటరీలో 2,888 కోట్ల జాక్‌పాట్‌

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.2,888 కోట్లు (448 మిలియన్‌ డాలర్లు) గెలిచారు.

లాస్‌ ఏంజిలస్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.2,888 కోట్లు (448 మిలియన్‌ డాలర్లు) గెలిచారు. ఇందులో నుంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేయనున్నారు.

పవర్‌బాల్‌ కంపెనీ ఈ లాటరీని నిర్వహించింది. ఇంత అదృష్టం ఎవరిని వరించిందనేది మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని ఓ దుకాణంలో ఈ బంపర్‌ టికెట్‌ అమ్ముడైనట్లు లాటరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాటరీ టికెట్‌ అమ్మిన దుకాణం యజమానికి కూడా దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలను పవర్‌బాల్‌ అందజేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement