17 ఏళ్ల బాలుడు.. 30కి పైగా హత్యలు! | 17-year-old boy accused of more than 30 murders | Sakshi
Sakshi News home page

17 ఏళ్ల బాలుడు.. 30కి పైగా హత్యలు!

Feb 4 2017 4:17 PM | Updated on Jul 12 2019 3:02 PM

17 ఏళ్ల బాలుడు.. 30కి పైగా హత్యలు! - Sakshi

17 ఏళ్ల బాలుడు.. 30కి పైగా హత్యలు!

వరుస హత్యలతో వణుకు పుట్టిస్తున్న ఓ పదిహేడేళ్ల బాలుడిని కొలంబియా పోలీసులు పట్టుకున్నారు

బొగొటా(కొలంబియా): వరుస హత్యలతో వణుకు పుట్టిస్తున్న ఓ పదిహేడేళ్ల బాలుడిని కొలంబియా పోలీసులు పట్టుకున్నారు. ఫ్రిజోలిటో అనే మారుపేరు గల ఆ బాలుడి పూర్తి వివరాలను అక్కడి పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

ఫ్రిజోలిటో 12 ఏళ్లకే మొదటి హత్యకు ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి ఎదురులేకుండా ఎదుగుతూ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ముఠాకు నాయకుడయ్యాడు. తన పనికి అడ్డువచ్చిన హతమార్చటమే లక్ష్యంగా పెట్టకున్నాడు. ఇప్పటి వరకు 30 మందికి పైగా చంపేశాడు. ఇతని చర్యలతో కాలి పట్టణ వాసులకు కంటిపై కునుకు లేకుండా పోయింది.

ఇటీవలే కాలి పట్టణంలోని షాపింగ్‌ మాల్‌ వద్ద ఫ్రిజోలిటో ఇద్దరు వ్యక్తులను చంపేశాడు. నాలుగు నెలలుగా గాలిస్తున్న కాలి పట్టణ పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం ఫ్రిజోలిటోను పట్టుకున్నారు. ప్రస్తుతం బాల నేరస్తులను ఉంచే ప్రదేశానికి అతడిని తరలించారు. ఫ్రిజోలిటో ప్రమాదకరమైన బాలుడని కాలి పోలీస్‌ చీఫ్‌ హ్యూగో కాసస్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement