వైమానిక దాడిలో 15 మంది మృతి | 15 workers killed as Saudi-led airstrikes hit cement factory in Yemen | Sakshi
Sakshi News home page

వైమానిక దాడిలో 15 మంది మృతి

Feb 4 2016 9:20 AM | Updated on Sep 3 2017 4:57 PM

యెమన్ లో సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన దాడిలో కనీసం 15 మంది కార్మికులు మృతి చెందారు.

సనా: యెమన్ లో సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన దాడిలో కనీసం 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. యెమెన్ ఉత్తర ప్రావిన్స్ లోని ఆమరాన్ లో సిమెంట్ కర్మాగారంపై బుధవారం ఈ వైమానిక దాడి జరిగింది. కర్మాగారం మెయిన్ గేటు వద్ద కార్మికులు జీతాలు తీసుకుంటుండగా ఈ దాడి జరిగిందని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారని 'జిన్హువా' వార్తా సంస్థ పేర్కొంది.
గాయపడిన వారిని ఆమరాన్ లోని ఆస్పత్రికి తరలించారని తెలిపింది.

కుటాఫ్ ప్రాంతంలోని ఆల్-జుబారా ట్రైబ్ లోని పలు గ్రామాలపై బుధవారం వైమానిక దాడులు జరిగాయి. సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన మూడు వైమానిక దాడుల్లో 40 మంది గ్రామస్థులు చనిపోవడం లేదా గాయపడడం జరిగిందని స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement