13 తరాల చెట్టు.. పర్వతమే పట్టు

13 generations of tree - Sakshi

మీరెన్ని తరాలను చూశారు? మహా అయితే మీ ముందు 3 తరాలను చూసుంటారు. ఇక మీ తర్వాతి 3 తరాలను చూడగలరు. అదీ కూడా మీరు వందేళ్లు బతికితేనే! ఫొటోలో ఉన్న ఈ చెట్టును చూశారా.. ఇది పదమూడు తరాలకు ప్రత్యక్ష సాక్షి. ఈ చెట్టు వయసు 1,230 సంవత్సరాలు. ఐరోపా ఖండంలోనే ఇది అతిపురాతన వృక్షం. ఇంతటితో దీని కథ ముగిసిందనుకోకండి ఇంకా కొన్ని శతాబ్దాల వరకు బతుకుతుందట! దక్షిణ ఇటలీలోని పొల్లినొ జాతీయ పార్కులో ఉన్న ఈ చెట్టును యూనివర్సిటీ ఆఫ్‌ టుసికా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీని శాస్త్రీయ నామం హెల్డ్రీచ్‌ పైన్‌.

ముద్దుగా ఇటాలస్‌ అని పిలుస్తారు. కార్చిచ్చు, తుపాన్లు వంటి భారీ ప్రకృతి విపత్తుల నుంచి ఎలా కాపాడుకోగలిగిందనే అనుమానం వస్తోంది కదూ? నిటారుగా ఉన్న పర్వతపు వాలు ప్రాంతంలో ఈ చెట్టు ఉండటమే కారణమట. ఆ పర్వతమే ఈ చెట్టుకు పట్టు అన్నమాట! ఈ చెట్టు వేర్లు పాక్షికంగా బయటకు ఉండటంతో రేడియోకార్బన్‌ డేటింగ్‌ పరిజ్ఞానం ద్వారా కచ్చితమైన వయసును అంచనా వేయగలిగారు శాస్త్రవేత్తలు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top