షాపింగ్‌ సెంటర్‌ వద్ద కాల్పులు.. 12 మంది మృతి..!

12 Died In Mass Shooting Rampage By A Soldier In Thailand - Sakshi

బ్యాంకాక్‌ : థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 12 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  ఈశాన్య థాయ్‌లాండ్‌లోని కోరట్‌ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. అయితే, మృతులకు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాల్పులకు తెగబడిన వ్యక్తి ఆర్మీలో పనిచేసే సార్జెంట్‌ మేజర్‌ జక్రఫంత్ థోమాగా గుర్తించారు. నిందితుడు ఆర్మీ వాహనాన్ని దొంగిలించడమే కాకుండా.. టెర్మినల్‌ 21 షాపింగ్‌ సెంటర్‌ ప్రాంతంలో కాల్పుల అనంతరం ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

ఇక తుపాకీ గుళ్ల వర్షంతో ఘటనాస్థలం యుద్ధభూమిని తలపించింది. మృతులు, క్షతగాత్రులతో భయానకంగా మారింది. ఆర్మీ క్యాంపు నుంచి దొంగిలించిన మెషీన్‌ గన్‌తో అఘాయిత్యానికి పాల్పడ్డ జక్రఫంత్ షాపింగ్‌ మాల్‌లోకి చొరబడి దాక్కున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన టెర్మినల్‌ 21 షాపింగ్‌ సెంటర్‌ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకునేందుకు అన్ని వైపులా బలగాలను మోహరించామని తెలిపారు.  పెద్ద సంఖ్యలో లైసెన్డ్స్‌ గన్‌లు కలిగిన ఉన్న దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో.. భద్రతా సిబ్బంది కాల్పులకు దిగడం అరుదు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top