అమెరికాలో ఉన్మాదిగా మారిన విద్యార్థి | 1 killed in stabbing attack on Texas University campus | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఉన్మాదిగా మారిన విద్యార్థి

May 2 2017 8:31 AM | Updated on Sep 5 2017 10:13 AM

అమెరికాలో ఉన్మాదిగా మారిన విద్యార్థి

అమెరికాలో ఉన్మాదిగా మారిన విద్యార్థి

యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు

హూస్టన్‌: యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. వేట కత్తితో తోటి విద్యార్థులపై దాడి చేశాడు. ఈ ఘటనలో.. ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1: 30 గంటల ప్రాంతంలో కెండ్రెక్స్‌ జే వైట్‌ అనే 21 ఏళ్ల విద్యార్థి ఉన్మాదిలా ప్రవర్తించాడు. క‍్యాంపస్‌లోని గ్రీగరీ వ్యాయమశాల వద్ద వెంటతెచ్చుకున్న వేటకత్తితో నలుగురిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ముగ్గురు తెల్లజాతీయులతో పాటు.. ఓ ఆసియా విద్యార్థి ఉన్నాడని అధికారులు వెల్లడించారు. బాధితులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసున్నవారే. వైట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ గ్రేగ్‌ ఫెన్విస్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement