కరవు పరిస్థితులపై వైఎస్సార్ సీపీ పోరుబాట | ysrcp protests in AP over drought situation | Sakshi
Sakshi News home page

కరవు పరిస్థితులపై వైఎస్సార్ సీపీ పోరుబాట

Apr 13 2016 2:13 PM | Updated on Aug 18 2018 5:57 PM

కరవు పరిస్థితులపై వైఎస్సార్ సీపీ పోరుబాట - Sakshi

కరవు పరిస్థితులపై వైఎస్సార్ సీపీ పోరుబాట

ఆంధ్రప్రదేశ్ లో కరవు పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కరవు పరిస్థితులపై వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.

చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, తహశీల్దార్ల కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉమ్మారెడ్డి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారన్నారు. 90 శాతం గ్రామాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాల్లో తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దుస్థితిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement