ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ | YS Jagan in the Iftar dinner | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్

Jun 30 2016 3:41 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ - Sakshi

ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్

వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మతీన్ మజాద్దాది నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మతీన్ మజాద్దాది నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కి పార్టీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బుధవారం రాత్రి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని మతీన్ నివాసంలో ఇఫ్తార్ సందర్భంగా ఉపవాస దీక్ష ముగించిన మతీన్‌కు జగన్ ఖర్జూరం తినిపించారు. మతీన్ కూడా గౌరవ సూచకంగా జగన్‌కు ఖర్జూరం తినిపించి, ముస్లిం సంప్రదాయ టోపీని, శాలువను అందజేశారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, పార్టీ ఏపీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు , కొండా రాఘవరెడ్డి, శివకుమార్, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, ఇంకా మతీన్ సోదరుడు ముబీన్, మాజీ ఎంపీ బాలశౌరి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement