మహిళపై కారులో యువకుల అత్యాచారయత్నం | Youth tries to rape woman in running car | Sakshi
Sakshi News home page

మహిళపై కారులో యువకుల అత్యాచారయత్నం

Jun 25 2014 9:42 AM | Updated on Sep 2 2017 9:23 AM

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి యత్నించారు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మహిళను కారులో తీసుకు వెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement