సొంతింటికే కన్నం వేశాడు | youngster theft gold arnaments in his own home | Sakshi
Sakshi News home page

సొంతింటికే కన్నం వేశాడు

Mar 11 2016 10:03 PM | Updated on Aug 20 2018 4:27 PM

సొంతింటికే కన్నం వేశాడు - Sakshi

సొంతింటికే కన్నం వేశాడు

సొంత ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో ఓ వ్యక్తిని రెయిన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

యాకుత్‌పురా: సొంత ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో ఓ వ్యక్తిని రెయిన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....యాకుత్‌పురా చున్నీకీ బట్టి ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ మూడో కుమారుడు మహ్మద్ ఖాజా (30) తన ఇంట్లోని 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బీరువాలో బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మహ్మద్ ఖాజానే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement