పాతబస్తీలో యువకుడి దారుణ హత్య | young man's brutal murder in hyderabad old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో యువకుడి దారుణ హత్య

Nov 29 2015 4:16 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ పాతబస్తీలో పహాడీ మీర్ ఆలం చెరువు వద్ద ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

పాతబస్తిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బహాదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడిమీర్ ఆలం చెరువు వద్ద ఆదివారం వెలుగుచూసింది. చెరువు సమీపంలోని పొదల్లో ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తితో దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement