హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ నిర్ణయం | yanamala ramakrishnudu speaks on RK roja suspension issue | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ నిర్ణయం

Mar 18 2016 12:29 PM | Updated on Aug 27 2018 8:44 PM

హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ నిర్ణయం - Sakshi

హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ నిర్ణయం

ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సభలో పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని యనమల తెలిపారు. సభ తీసుకున్న నిర్ణయంపై మళ్లీ సభే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ నిర్ణయించడం హర్షణీయమని చెప్పారు.

సభ ఆమోదం తెలిపిన తర్వాతే ఎమ్మెల్యే ఆర్కే రోజాను సస్పెండ్ చేశామన్నారు. మాకు ఎవరి మీదా కోపం లేదు, ఎవరినీ ఇబ్బంది పెట్టాలనీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను దిక్కరించాలనే ఆలోచన తమకు లేదన్నారు. అసెంబ్లీలో విపక్షం లేకపోవడం బాధాకరమని మంత్రి యనమల చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement