పొరుగింటివారు తిట్టారని.. | Woman commits suicide | Sakshi
Sakshi News home page

పొరుగింటివారు తిట్టారని..

Jun 13 2016 5:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంటి పక్కవారు అకారణంగా తిట్టారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ మండలం కొత్తగూడలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ : ఇంటి పక్కవారు అకారణంగా తిట్టారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ మండలం కొత్తగూడలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత(21)కు ఆదివారం పొరుగింటివారితో గొడవ జరిగింది. ఈ సందర్భంగా వారు అనవసరంగా దుర్భాషలాడారంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement