దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే.. | Woman attacked and robbed of gold | Sakshi
Sakshi News home page

దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే..

Jun 16 2016 5:48 PM | Updated on Aug 30 2018 5:27 PM

దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే.. అదను చూసి మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలతో పరారయ్యాడో ప్రబుద్ధుడు.

హైదరాబాద్ : దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే.. అదను చూసి మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలతో పరారయ్యాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ దూరపు బంధువు కదా అని ఓ యువకుడికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె గొంతు కోసి బంగారు నగలతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement