పిక్‌పాకెటింగ్ పాల్పడుతున్న పాత నేరస్తురాలును మలక్‌పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
పిక్‌పాకెటింగ్ పాల్పడుతున్న పాత నేరస్తురాలును మలక్‌పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన జానకి(37) మౌలాలిలో నివాసం ఉంటుంది. చౌటుప్పల్‌కు చెందిన జయమ్మ శనివారం దిల్‌సుఖ్‌నగర్ చందన బ్రదర్స్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద నిల్చుండగా ఆమె బ్యాగును దొంగతనం చేసింది. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న పోలీసులు జానకి అదుపులోకి తీసుకున్నారు. ఆమె విచారించగా జయమ్మ బ్యాగులోని రూ.20 వేలు నగదు, జానకి నుంచి 14 తులాల బంగారం రీకవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.కాగా.. గతంలో విజయవాడ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లు, నగరంలోని ఆయా పీఎస్ పరిధిలో జానకిపై దొంగతనం కేసులు నమోదు అయ్యాయి.