విజయుడు... రామచంద్రుడు | win of candidate of the BJP MLC | Sakshi
Sakshi News home page

విజయుడు... రామచంద్రుడు

Mar 26 2015 12:25 AM | Updated on Mar 29 2019 9:31 PM

విజయుడు... రామచంద్రుడు - Sakshi

విజయుడు... రామచంద్రుడు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు ....

బీజేపీలో ఆనందోత్సాహాలు
నగరంలో భారీగా సంబరాలు
టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నిరాశ

 
సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు విజయదుందుభి మోగించడం నగరంలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపింది. బుధవారం రాత్రి వారంతా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోవడానికి ఈ గెలుపు దోహదం చేస్తుందని నాయకులు, కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామచంద్రరావు రూపంలో లభించిన ఘన విజయం పార్టీ ఓటు బ్యాంకును సమీకరించడానికి తోడ్పడుతుందని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. హైదరాబాద్‌లో రాజకీయ పునరేకీకరణకు... ప్రధాన పక్షంగా బలం సాధించుకునేందుకు వీలవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

 వెల్లివిరిసిన ఆనందం

 ఓ వైపు టీవీ చానెళ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే నగరంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా పేల్చి... రంగులు చల్లుకొని... సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. కేరింతలు కొట్టారు. మరోవైపు నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement