హ్యాండ్‌బ్యాగ్ హెల్మెట్! | Why don't put Helmet on Motor Cyclist | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బ్యాగ్ హెల్మెట్!

Oct 9 2016 3:43 AM | Updated on Sep 4 2017 4:40 PM

హ్యాండ్‌బ్యాగ్ హెల్మెట్!

హ్యాండ్‌బ్యాగ్ హెల్మెట్!

హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని మోటార్ సైక్లిస్టులను అడగండి. సగం కంటే ఎక్కువ మంది ‘అబ్బే...

హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని మోటార్ సైక్లిస్టులను అడగండి. సగం కంటే ఎక్కువ మంది ‘అబ్బే... మోత బరువు సార్’ అనే అంటారు. అలాంటి వారి కోసమేనేమో... న్యూయార్క్‌లోని ఓ కంపెనీ ఈ ఫొటోల్లో చూపిన హెల్మెట్‌ను తయారు చేసింది.

ఏబీఎస్ అనే పదార్థంతో తయారుచేసిన ఈ హెల్మెట్ దృఢంగా ఉండటమే కాకుండా... మామూలు హెల్మెట్ల సైజులో మూడో వంతు మాత్రమే ఉంటుంది. అవసరం లేనప్పుడు దీన్ని మడతపెట్టి బ్యాగులోకి కుక్కేసుకోవచ్చునన్నమాట!
 

Advertisement
 
Advertisement
Advertisement