టీఆర్ఎస్కు సహకారం అందిస్తాం: వంశీచంద్ | we will cooperate with TRS party, says Congress party MLA Vamshi Chand Reddy | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్కు సహకారం అందిస్తాం: వంశీచంద్

May 20 2014 2:33 PM | Updated on Mar 18 2019 7:55 PM

టీఆర్ఎస్కు సహకారం అందిస్తాం: వంశీచంద్ - Sakshi

టీఆర్ఎస్కు సహకారం అందిస్తాం: వంశీచంద్

ఎమ్మెల్యే పదవి బాధ్యతగా భావిస్తానని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన వంశీ చంద్ రెడ్డి అన్నారు.

ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించారని... అందుకే ఆ పార్టీకి ఓటేశారని కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీచంద్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో అన్నారు. అదికాక తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుని టీఆర్ఎస్ను గెలిపించారన్నారు.

 

అలాగే 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉండి వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి తమ వంతు సహకారం అందిస్తామని వంశీచంద్ స్పష్టం చేశారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఓడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధపడాల్సిన అవసరం లేదని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement