
‘హోదా’ కావాలంటే కేంద్రం నుంచి తప్పుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకోవాలని, ప్రధానమంత్రికి తూతూ మంత్రంగా లేఖ రాస్తే
టీడీపీకి ఎంపీ వీహెచ్ సలహా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకోవాలని, ప్రధానమంత్రికి తూతూ మంత్రంగా లేఖ రాస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందన్నారు.
ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు చాలా మాట్లాడారని, ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ట్విట్టర్‌లో కూతలు కూసే పవన్ కల్యాణ్, కాంగ్రెస్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకుంటే అతనికే మంచిదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడి రాజకీయంగా పలుచన కావొద్దన్నారు.