వాసవి కాలేజీ నిర్వాహకుల అరెస్ట్‌ | Vasavi fraud: management arrested by police | Sakshi
Sakshi News home page

వాసవి కాలేజీ నిర్వాహకుల అరెస్ట్‌

Mar 3 2017 10:59 AM | Updated on Sep 5 2017 5:06 AM

ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకున్న శ్రీవాసవి జూనియర్‌ కాలేజ్‌ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వనస్థలిపురం: వందలాదిమంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకున్న వనస్థలిపురంలోని శ్రీవాసవి జూనియర్‌ కాలేజ్‌ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనయ్య, శ్యాంసుందర్‌ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు. ఇంటర్‌ బోర్డ్‌ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోని కాలేజ్‌ యాజమాన్యం హాల్‌ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలు లేకుండాపోయింది. 
 
విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ ముందు ఆందోళన చేసినప్పటికీ, హాల్‌టిక్కెట్లు ఇవ్వలేమని బోర్డు చేతులెత్తేసింది. సప్లిమెంటరీ అవకాశం కల్పిస్తామని సూచించింది. దీంతో 300 మందికిపైగా విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. వాసవి కాలేజ్‌ యాజమాన్యంపై ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement