నన్ను నటిగా ఆకాశానికి ఎత్తారు:వాణిశ్రీ | Vanisri comments on VB Rajendra Prasad | Sakshi
Sakshi News home page

నన్ను నటిగా ఆకాశానికి ఎత్తారు:వాణిశ్రీ

Jan 12 2015 9:46 PM | Updated on Sep 2 2017 7:36 PM

వాణిశ్రీ

వాణిశ్రీ

వీబీ రాజేంద్ర ప్రసాద్ సినిమా నిర్మాణ సంస్థ జగపతి బేనర్పై చిత్రం అంటే అందులో పనిచేసే అందరికీ పండుగేనని అలనాటి హీరోయిన్ కళాభినేత్రి వాణిశ్రీ చెప్పారు.

హైదరాబాద్: వీబీ రాజేంద్ర ప్రసాద్ సినిమా నిర్మాణ సంస్థ జగపతి బేనర్పై చిత్రం అంటే అందులో పనిచేసే అందరికీ పండుగేనని అలనాటి హీరోయిన్ కళాభినేత్రి వాణిశ్రీ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారని తెలిసిన తరువాత ఆమె ఒక టీవీ చానెల్తో మాట్లాడుతూ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్  మొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్టయిన సంచలన చిత్రం దసరాబుల్లోడు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార శైలిని, నడవడికను అనేక విధాల కొనియాడారు.

వాణిశ్రీ మాటల్లోనే... రాజేంద్ర ప్రసాద్ గొప్ప వ్యక్తిత్వం గలవారు. అందరినీ ఎంతగానో గౌరవించేవారు. మంచి మనసున్న వ్యక్తి. ఆ నాటి అగ్ర హీరోలతో పోల్చితే నాకు అత్యధిక రెమ్యూనరేష్ ఇచ్చి ఆకాశానికి ఎత్తారు. దసరాబుల్లోడు, బంగారు బాబు రెండు చిత్రాలతో నన్ను బాగా హైలెట్ చేశారు. అప్పటివరకు ప్రతి చిత్రంలో నేను ధరించే చీరలను నేనే సెలక్ చేసుకునేదానిని. ఆయన సినిమాలలో మాత్రం చీరలను ఆయనే సెలక్ చేసేవారు. ఆయన గొప్ప నిర్మాత అయినప్పటికీ సినిమాటిక్ వ్యవహారాలు ఏమీ ఆయనకు లేవు.భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా చిరస్మరణీయుడు.

Advertisement
 
Advertisement
Advertisement