Nov 22 2016 10:00 AM | Updated on Aug 25 2018 6:22 PM
రెండు బైకులను తగులబెట్టిన దుండగులు
రెండు ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.
హైదరాబాద్ సిటీ: నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్ చంద్రానగర్‌లో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఇళ్లముందర నిలిపి ఉంచిన మోటార్ బైక్‌లను పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. గతంలో కూడా దుండగులు ఇలా ద్విచక్రవాహనాలను తగులబెట్టారని బస్తీవాసులు పేర్కొన్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.