'అందరి చూపు తెలంగాణ భవన్ వైపే' | trs will win 100 seats in ghmc says talasaani srinivas yadav | Sakshi
Sakshi News home page

'అందరి చూపు తెలంగాణ భవన్ వైపే'

Jan 3 2016 5:37 PM | Updated on Aug 15 2018 9:30 PM

'అందరి చూపు తెలంగాణ భవన్ వైపే' - Sakshi

'అందరి చూపు తెలంగాణ భవన్ వైపే'

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా టార్గెట్ 100 సీట్లని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా టార్గెట్ 100 సీట్లని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

సమావేశం ముగిసిన అనంతరం తలసాని మాట్లాడుతూ.. ఇప్పుడు అందరి చూపు తెలంగాణ భవన్ వైపే ఉందని తెలిపారు. పాత, కొత్త నాయకులం అందరం కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారని తలసాని పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినవే చెబుతున్నామని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement