'మాకూ, టీడీపీకి తేడా అదే' | TRS MP vinod takes on chandrababu | Sakshi
Sakshi News home page

'మాకూ, టీడీపీకి తేడా అదే'

May 31 2016 12:52 PM | Updated on Jul 28 2018 3:33 PM

'మాకూ, టీడీపీకి తేడా అదే' - Sakshi

'మాకూ, టీడీపీకి తేడా అదే'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాజ్యసభకు మేం ప్రజల కోసం పని చేసే వాళ్లను పంపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం వ్యాపారులను పంపిస్తున్నారని వినోద్కుమార్ ఆరోపించారు. మాకు, టీడీపీకి తేడా అదే అని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, టీడీపీ మద్దతుతో బీజేపీ తరఫున కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఎంపిక చేసింది. వీరిద్దరు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్పై విధంగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement