నరకానికి కేరాఫ్ అడ్రస్ గాంధీభవన్ | TRS MLCs takes on Congress party | Sakshi
Sakshi News home page

నరకానికి కేరాఫ్ అడ్రస్ గాంధీభవన్

Jun 26 2014 2:07 PM | Updated on Mar 18 2019 7:55 PM

నరకానికి కేరాఫ్ అడ్రస్ గాంధీభవన్ - Sakshi

నరకానికి కేరాఫ్ అడ్రస్ గాంధీభవన్

బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావులు స్పష్టం చేశారు.

బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావులు స్పష్టం చేశారు. తాము పదవులు ఆశించి టీఆర్పార్టీలో చేరలేదని... తమకు పార్టీలో ఎటువంటి పదవులు తీసుకోమని వారు తెలిపారు. గురువారం హైదరాబాద్లో తాము ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి  టీఆర్ఎస్ పార్టీలో చేరింది విలేకర్ల సమావేశంలో వివరించారు.

 

కాంగ్రెస్ పార్టీలో దోపిడీదారులు ఎక్కువయ్యారని ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావు ఆరోపించారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, డీఎస్లు ఇద్దరు దోపిడి దారులేనని వారు అభివర్ణించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని నేత పైరవీ ద్వారా పదవులు తెచ్చుకున్నారని విమర్శించారు. గాంధీభవన్ నరకలోకానికి కేరాఫ్ అడ్రాస్గా మారిందని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement