నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ | TRS Legislative Party Meeting To Be Held On Today | Sakshi
Sakshi News home page

నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

Jan 3 2016 8:20 AM | Updated on Sep 3 2017 3:01 PM

నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్లో టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రేటర్ మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో గ్రేటర్ మేనిఫెస్టోను టీఆర్ఎస్ విడుదల చేయనుంది.

అలాగే గ్రేటర్లోని 150 డివిజన్ల బాధ్యతను పార్టీలోకి కీలక నేతలకు అప్పగించనున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలు అయిన తర్వాతే మేయర్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్లో సోమవారం నుంచి అధికారికంగా టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement