breaking news
TRS Legislative Party Meeting
-
అందుకే గవర్నర్‌ను కలిశాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి.. పార్టీ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను అందజేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను గవర్నర్‌కు అందజేశామని తెలిపిన ఎమ్మెల్యేలు.. పరిచయం కోసం మాత్రమే గవర్నర్‌ను కలిశామంటూ.. తాము గవర్నర్‌ను కలువడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. మరోవైపు కొత్తగా కొలువుదీరనున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తిగా మారింది. కొత్త మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. వీరు గవర్నర్‌ను కలువడం కూడా ఊహాగానాలకు తావిస్తోంది. -
నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ
-
నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రేటర్ మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో గ్రేటర్ మేనిఫెస్టోను టీఆర్ఎస్ విడుదల చేయనుంది. అలాగే గ్రేటర్‌లోని 150 డివిజన్ల బాధ్యతను పార్టీలోకి కీలక నేతలకు అప్పగించనున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలు అయిన తర్వాతే మేయర్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్లో సోమవారం నుంచి అధికారికంగా టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుంది.