జనవరిలో బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ భేటీ | tribunal brijesh meeting in January | Sakshi
Sakshi News home page

జనవరిలో బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ భేటీ

Dec 14 2016 3:17 AM | Updated on Aug 29 2018 9:29 PM

జనవరిలో బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ భేటీ - Sakshi

జనవరిలో బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ భేటీ

కృష్ణా జలాలపై వాదనలు వింటున్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యు నల్‌ సమావేశాలు తిరిగి జనవరి 22న మొదలుకానున్నాయి

అఫిడవిట్ల దాఖలుకు తెలుగు రాష్ట్రాలకు 30 వరకు గడువు
కృష్ణా నీటి కేటాయింపులపై నిర్ణయం వెల్లడించని బోర్డు


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలపై వాదనలు వింటున్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యు నల్‌ సమావేశాలు తిరిగి జనవరి 22న మొదలుకానున్నాయి. ఈ మేరకు ట్రిబ్యునల్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముంది. నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ వంటివన్నీ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమని ట్రిబ్యునల్‌ పేర్కొంది.

సెక్షన్‌ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజె క్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్‌ ప్రోటో కాల్‌లను తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్‌ 14న చేపడతామంటూ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయాలు వెల్లడించాలని ఆదేశించింది. అయితే మరింత గడువు కావా లన్న ఇరు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు.. ఈ నెల 30లోగా అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. దీంతో ఈ నెల 14న జరగా ల్సిన సమావేశాలను వాయిదా వేసిన ట్రిబ్యు నల్‌... వచ్చే నెల 22, 23న సమావేశాలు నిర్వహిస్తామంటూ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

తేలని పంచాయితీ..!
మరోవైపు కృష్ణా జలాల కేటాయింపులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏమీ తేల్చ లేదు. లభ్యత జలాల్లో తెలంగాణకు 43 టీఎంసీలు, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తా మని... దీనిపై ఈ నెల 13 లోగా అభిప్రా యాలు చెప్పాలని 4 రోజుల కిందే బోర్డు తెలంగాణ, ఏపీలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆలోగా అభిప్రాయం చెప్పకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. కానీ గడువులోగా ఇరు రాష్ట్రాలూ దీనిపై స్పందించకున్నా... కృష్ణా బోర్డు మంగళవారం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ అందుబాటులో లేకపోవడం వల్లే నిర్ణయం వెలువడలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement