వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రవాణా భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిందైంది. ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి. 20 మందికిపైగా మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 బస్సు ప్రమాదాలు (మృతుల సంఖ్య ఆధారంగా) పరిశీలిస్తే..
2018-కొండగట్టు, జగిత్యాల జిల్లా, తెలంగాణ
మృతులు: 57
RTC బస్సు ఓవర్‌లోడెడ్‌గా ఉండి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది. సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘోరం.. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఈ ఘటనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆ ‘మృత్యుఘాట్’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి.
2013-పాలెం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ
మృతులు: 45
అక్టోబర్ 30న బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు ఓ కారును ఓవర్‌టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో మొత్తం 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
2012 – మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
బస్సు చెరువులోకి దూసుకెళ్లింది
మృతులు: 22
2025- కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి
మృతులు: 20+
2010-అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఓవర్‌స్పీడ్ బస్సు బోల్తా పడింది
మృతులు: 18
2014-మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ
- రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బస్సును రైలు ఢీకొంది.
- మృతులు: 16
2019- వెల్దుర్తి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఓ వోల్వో బస్సు బైక్‌ను తప్పించబోయి తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. మృతులంతా తెలంగాణలోని గద్వాల జిల్లాకు చెందినవారు
మృతులు: 15
2015 – ఖమ్మం జిల్లా, తెలంగాణ
విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదం
మృతులు: 13
2017-అరకు, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
APSRTC బస్సు లోయలో పడిపోయింది
మృతులు: 11
2021 – జల్లేరు వాగు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
RTC బస్సు వాగులో పడిపోయింది
మృతులు: 9
2019 – శ్రీశైలం ఘాట్ రోడ్, తెలంగాణ
పుణ్యక్షేత్ర దర్శన బస్సు లోయలో పడింది
మృతులు: 9


