బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో వాహనాల ప్రవేశంపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో వాహనాల ప్రవేశంపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా నుంచి జహిరానగర్ మీదుగా స్టార్ ఆస్పత్రి, కార్వీ, రెయిన్‌బో ఆస్పత్రి, సిటీ సెంటర్‌మాల్ చౌరస్తా వరకు సోమవారం నుంచి వాహనాలను అనుమతించరని బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
వైట్‌టాపింగ్ రోడ్డు వేస్తున్న దృష్ట్యా ఒక వైపు రోడ్డును మూసి వేయాల్సి వస్తుందన్నారు. ఈ నెల 15 వరకు ఆ రోడ్డులో వైట్‌టాపింగ్ పనులు జరుగుతాయని ఆయన వివరించారు. అయితే సిటీ సెంటర్ మాల్ నుంచి రెయిన్‌బో ఆస్పత్రి, కార్వీ మీదుగా జహిరానగర్ వరకు వైట్‌టాపింగ్ పనులు పూర్తయిన దృష్ట్యా ఆదివారం నుంచి వాహనదారులను అనుమతించినట్లు చెప్పారు.