వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ల సమావేశం రేపు | Tomorrow ysrcp Coordinator Meeting | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ల సమావేశం రేపు

Aug 16 2016 1:46 AM | Updated on May 29 2018 5:25 PM

వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ల సమావేశం రేపు - Sakshi

వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ల సమావేశం రేపు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల(కోఆర్డినేటర్లు) సమావేశం ఈ నెల 17వ తేదీన...

గడప గడపకూ వైఎస్సార్’పై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల(కోఆర్డినేటర్లు) సమావేశం ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లో జరుగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు.

జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటినుంచీ  క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం సాగుతున్న తీరు తెన్నులను సమీక్షించడానికి ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement