టుడే న్యూస్ డైరీ | today news dairy | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Mar 11 2016 7:41 AM | Updated on Oct 17 2018 4:53 PM

నేటి నుంచి ఢిల్లీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు, హాజరుకానున్న ప్రధాని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం.. భారత్ కు పాక్ జట్టు రాక..

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫెస్ట్: అనేక వివాదాల నడుమ ఢిల్లీలోని యమునా నదీ తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తలపెట్టిన ప్రపంచ సంస్కృతిక ఉత్సవాలు(వరల్డ్ కల్చరల్ ఫెస్ట్) నేడు ప్రారంభంకానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 190 దేశాలకు చెందిన 35 లక్షల మంది ప్రతినిధులు వేడుకలో పాల్గొంటారు.  

ఏపీ అసెంబ్లీ: వాడీవేడిగా సాగుతోన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా కొనసాగనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ: గురువారంనాటి గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ శాసనసభ నేడు తిరిగా ప్రారంభం కానుంది. ఉదయం బీఏసీ సమావేశం అనంతరం సభాకార్యకలాపాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సభ ప్రారంభం కాగానే దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట రెడ్డికి నివాళులు అర్పిస్తారు. టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ మధుసుదనాచారి టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించిన నేపథ్యంలో వారికి నేడు సీట్లు కేటాయించనున్నారు.

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం: తనపై విధించిన ఏడాది సస్సెన్షన్ ను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ నేడు విచారణకురానుంది.

భద్రాద్రి: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు శ్రీరామ మహాక్రతువు ప్రారంభంకానుంది. యాగశాలలో పండితులు హోమాగ్నితో అగ్నిప్రతిష్టచేయనున్నారు. సాయంత్రం రామాయణ పారాయణం ఉంటుంది.

టీ20 వరల్డ్ కప్: నేడు పాకిస్థాన్ జట్టు భారత్ కు రాక.

Advertisement
 
Advertisement
Advertisement