చలి తీవ్రతకు తట్టుకోలేక వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. నాలుగు రోజులుగా వీస్తున్న చలి గాలుల ప్రభావంతో వరంగల్ జిల్లాలో
హైదరాబాద్/బచ్చన్నపేట/మంగపేట: చలి తీవ్రతకు తట్టుకోలేక వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. నాలుగు రోజులుగా వీస్తున్న చలి గాలుల ప్రభావంతో వరంగల్ జిల్లాలో మంగళవారం ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన శివరాత్రి మల్లమ్మ(68), మంగపేట మం డలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోగిల వెంకటమ్మ(80) మృత్యువాత పడ్డారు. వెంకటమ్మకు కుమారుడు పోశయ్య అప్పులు తీర్చలేక నెల రోజుల క్రితం ఊరిడిచి వెళ్లాడు. దీంతో ఆమె గ్రామంలోనే ఉంటున్న తన కుమార్తె పుల్లూరి నాగమణి వద్ద నివసిస్తోంది.
హైదరాబాద్ నాంపల్లిలోని దర్గా యూసుఫియన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(55) సోమవారం ఫుట్‌పాత్‌పై పడి మృతి చెందాడు. హబీబ్‌నగర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. అతడి ఒంటిపై గ్రే కలర్ చొక్కా, గ్రే కలర్ టీ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.