తల్లి, కూతురు అదృశ్యం | The disappearance of the mother and daughter | Sakshi
Sakshi News home page

తల్లి, కూతురు అదృశ్యం

Oct 28 2016 8:02 PM | Updated on Sep 4 2017 6:35 PM

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

నాగోలు: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు భార్య అనంతలక్ష్మీ (35), కూతురు గౌరి (15)లు నగరానికి వచ్చి గుంటిజంగయ్యనగర్‌కాలనీలో నివాసముంటున్నారు.

అనంతలక్ష్మీ సితారా హోటల్‌లో పనిచేస్తుండగా గౌరి స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 16వ తేదీన అనంతలక్ష్మీ, గౌరిలు కనిపించకుండాపోయారు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement