హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్తత | tension at hayathnagar police station | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్తత

Mar 6 2017 12:35 PM | Updated on Sep 5 2017 5:21 AM

నగరంలోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక కుంట్లూరులో ఉన్న తమ భూములను అధికార పార్టీకి చెందిన ఎంపీపీ హరిత ధనరాజ్‌ గౌడ్ భర్త ధనరాజ్‌ కబ్జా చేశాడని ఆరోపిస్తూ.. కొందరు బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ఇదే అంశంపై పోలీసులతో మాట్లాడటానికి వచ్చిన ధనరాజ్‌ అక్కడ ఉన్న బాధితులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement