తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విదేశీ పర్యటనకు వెళుతున్న సందర్భంగా పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విదేశీ పర్యటనకు వెళుతున్న సందర్భంగా పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ పర్యటనలో భాగంగా ఉన్నతాధికారులు యూఎస్, యూకే దేశాలు సందర్శించనున్నారు. అక్కడి మోడ్రన్ పోలీసింగ్, సీసీ కెమెరాల వ్యవస్థ ఇతర అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
*రామకృష్ణారావు ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ స్థానంలో శివశంకర్ కు అదనపు బాధ్యతలు.
*రాజీవ్ త్రివేదీ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ స్థానంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు అదనపు బాధ్యతలు.
*అనురాగ్ శర్మ డీజీపీ స్థానంలో అదనపు డీజీ సుదీప్ లక్టాకియాకు అదనపు బాధ్యతలు.
*మహేందర్ రెడ్డి పోలీస్ కమిషనర్, హైదరాబాద్ స్థానంలో అదనపు కమిషనర్ జితేందర్ కు అదనపు బాధ్యతలు..
వీరంతా పదిరోజుల పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.