నేడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు | Telangana Govt Declares Jan 1 As Holiday | Sakshi
Sakshi News home page

నేడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

Jan 1 2016 1:52 AM | Updated on Aug 11 2018 4:59 PM

నూతన సంవత్సరం పురస్కరించుకొని జనవరి 1ని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.

హైదరాబాద్: నూతన సంవత్సరం పురస్కరించుకొని జనవరి 1ని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. గతంలో ఐచ్ఛిక సెలవుగా ఉన్న జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటించినందున అందుకు ప్రతిగా వచ్చే ఫిబ్రవరి 13వ తేదీ (రెండవ శనివారం) పనిదినంగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement