తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది. లక్షలాది ప్రైవేట్ భూములను 22ఏలో చేర్చారని ఫిర్యాదు అందడంతో ఈ చర్య తీసుకుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారని పిటిషనర్ ఆరోపించారు. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.